Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలకి ఉన్న ఉద్యోగ ప్రజ్ఞకి సాటి లేదు అంటున్నారు పరిశోధకులు. ఇక భవిష్యత్ వారిదే అని కూడా గట్టిగా చెబుతున్నారు. నిన్నటి దాకా మేధస్సు, అనుభవం, మాత్రమే కార్పొరేట్ కార్యాలయాలలో మంచి స్థితిలో ఉండటానికి ఉపయోగపడతాయి అని నమ్మేవారు. అయితే ఆ మధ్య అమెరికాకు చెందిన ''ఈగన్ జెండర్'' అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఆ రెండింటి కన్నా , ఉద్యోగంలో ప్రజ్ఞ ఉన్నవారే గొప్ప విజయాలు సాధించగలరని తేలింది.
సుమారు అయిదు వందల మందికి పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ల పనితీరుని పరిశీలించిన మీదట ఈ విషయం తెలిసింది. ఓ బృందంగా పని చేసేటప్పుడు పరస్పర సహకారం, కోప తాపాల నియంత్రణ , స్నేహంగా వుండటం మొదలైన లక్షణాలు వున్నవారు ఉద్యోగంలో చక చకా పైకి ఎదుగుతున్నారట.
అలా కాకుండా కేవలం ప్రతిభ , అనుభవాన్నే నమ్ముకున్నవారు వెనక పడుతున్నారట. సో మహిళల సహజ లక్షణాలైన స్నేహశీలత, సహనం వంటివి వారి బలాలుగా మారి వారిని ఉన్నత స్థాయికి చేరుస్తున్నాయి అని వీరు పరిశీలించి చెబుతున్నారు.
అయితే వీరు ఒక సలహా కూడా చెబుతున్నారు వీరి అధ్యయనంలో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం ఆశించిన స్థాయిలో లేకపోవటం, స్వతంత్రంగా వ్యవహరించటంలో తడబాటులని కూడా గమనించారుట. ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెట్టండి చాలు మీకు తిరుగు లేదు అని గట్టిగా చెబుతున్నారు.