Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మందార పూలలో ఉన్న ఏ, సీ విటమిన్స్, ఎమినో ఆసిడ్స్ జుట్టు రాలకుండా కాపాడతాయి. రెండు కప్పుల కొబ్బరి నూనెలో పది మందార పూలూ, ఆకులూ వేసి పూలు నల్లగా అయ్యేవరకూ మరిగించండి. దీన్ని వడ కట్టి, చల్లార్చి నిల్వ చేసుకోండి. రాత్రి నిద్రకి ముందు ఈ ఆయిల్‌తో మసాజ్ చేయండి. పొద్దున్న తలస్నానం చెయ్యండి. వారాంలో రెండు మూడు సార్లు ఇలా చేయొచ్చు.
- మెంతులు చుండ్రుని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఒక కప్పు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్న వాటిని మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకి పట్టించండి. నలభై నిమిషాల తరువాత కడిగేయండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చెయ్యచ్చు.
- మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేడి చేయండి. వడకట్టి చల్లారనివ్వండి. ఈ నూనెతో వారానికి రెండు మూడు సార్లు మసాజ్ చేసుకోండి.
- షాంపూతో తలస్నానం చెయ్యచ్చు కానీ మరీ ప్రతి రోజూ చేస్తే హెయిర్ ఫాల్ తప్పదు. అది కూడా మైల్డ్ షాంపూ వాడడం మంచిది. అలాగే వేడి వేడి నీళ్ళతో ఎప్పుడూ తలస్నానం చెయ్యకండి. చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చెయ్యాలి. డ్రయ్యర్‌తో కాకుండా జుట్టుని గాలికి ఆరనివ్వండి. టైట్‌గా లాగి జడ వెయ్యడం, పోనీ టైల్ వేయొద్దు. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు, బాగా ఆరాకే మెల్లగా, నిదానంగా దువ్వాలి.