Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలు తాగితే ఎంతో బలం... అలాగే ఎంతో అందం కూడా. పాలతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు సీనియర్ డైటీషియన్లు. పాలు తాగడంతో పాటు ముఖానికి పూతలా వేయడం వల్ల కూడా అనే లాభాలు ఉన్నాయని అంటున్నారు.
- పాలు శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్లా ఉపయోగపడతాయి. పాలు రోజూ తాగడం వల్ల చర్మగ్రంథులు శుభ్రపడతాయి.
- పాలులోని గుణాలు మురికిని, మత కణాలను బయటికి పంపేస్తాయి. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.
- దూదిని పాలల్లో ముంచి ముఖంపై మెత్తగా మర్ధనా చేయాలి. ఇలా అయిదు నిమిషాల పాటూ చేసి... తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఫలితంగా ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోయి శుభ్రపడుతుంది.
- పొడిచర్మం ఉన్న వారైతే దూదిని పాలలో ముంచి ముఖమంతా మర్ధనా చేసుకున్నాక 20 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
- పాలల్లో అరటి గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. చర్మం పొడిగా మారడం తగ్గి, చర్మం తేమగా మారుతుంది.
- ఎండలో చర్మం కమిలినట్టు అయితే ఫ్రిజ్లో ఉంచిన చల్లని పాలను ముఖానికి పట్టించాలి. చర్మానికి రక్షణగా ప్రొటీన్ పొర ఏర్పడుతుంది. ముఖం మండడం తగ్గిపోతుంది.