Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు చెంచాలను తీసుకుు కాసేపు ఫ్రిజ్లో పెట్టాలి.. కాసేపటి తర్వాత వాటిని వాచిన కండ్లపై అదిమినట్లు పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ చల్లదనానికి కండ్ల వాపు వెంటనే తగ్గుతుంది. అయితే మరీ నొక్కినట్లు కాకుండా కాస్త అదిమిపెడితే చాలు.
- గ్రీన్ టీ బ్యాగ్స్ కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని కండ్లపై పెట్టడం వల్ల త్వరగా సమస్య తగ్గుతుంది. వీటిని ఇలా పెట్టుకోవడం వల్ల కళ్లు కాంతివంతంగా కూడా మారతాయి. అందంగా కనిపిస్తాయి. రిలాక్స్ అవుతాయి.
- కీరా ముక్కలు కూడా కండ్లను కాంతివంతంగా మార్చడంలో బాగా పనిచేస్తాయి. కీరా చక్రల్లా కట్ చేసి ఫ్రిజ్లో పెట్టి లేదా అలానే కండ్లపై పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత తీయాలి. ఇలా చేస్తుంటే కండ్లు రిలాక్స్ అయి అందంగా కుపిస్తాయి.