Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐస్ ప్యాక్ దంత నొప్పిని తగ్గిస్తుందని చెబుతారు. ముఖ్యంగా పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఐస్ ప్యాక్ తీసుకుని చెంపలకు వెలుపల భాగాన పన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో కొన్ని నిమిషాలు అలా అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
- వెచ్చని ఉప్పు నీటితో నోరు శుభ్రం చేయడం ద్వారా, దంత కుహరాలలో లేదా దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది వాపును తగ్గిస్తుంది. ఉప్పునీటి చిట్కా గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
- టీస్పూన్ ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కరిగించి, ఉమ్మి వేయడానికి ముందు 30 సెకన్ల పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి.
- వెల్లుల్లి పంటి నొప్పికి చక్కగా పని చేస్తుంది. వెల్లుల్లి అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. తాజా వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి, ఆపై కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో రాయాలి. కొద్దిసేపటికే కొంత ఉపశమనం పొందుతారు.
- పుదీనాకు కూడా పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్, ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, కాస్త చల్లబడిన తరువాత వాటితో పుక్కిలించొచ్చు. లేదా టీ లా తాగేసేయొచ్చు. తడి టీ-బ్యాగ్ ను కూడా నొప్పి తగ్గే వరకూ నొప్పి ఉన్న భాగంలో అదిమిపెట్టుకోవచ్చు..