Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొప్పాయి... తినేకొద్ది తినాలనిపిస్తుంది. అయితే దీన్ని ఔషదాల తయారీకి ఉపయోగిస్తారనే సంగతి చాలామందికి తెలియదు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, బి6, కాల్షియం, మ్యాగ్నిషియం, విటమిన్ ఏ, సి, బి1, బి3, ఇ, కె, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగిస్తుంటారు.
బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది. విరేచన సమస్యలను సహజ సిద్ధంగా నివారిస్తుంది. అందుకే బొప్పాయి జీర్ణక్రియకు సంజీవని వంటిందని అంటారు. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. శరీరానికి పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది. బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే.. అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద, చిన్న పేగుల్లోనే ఉంటాయి. బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.