Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అన్నీ రంగాలలో రాణిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది ''నీకేం తెలుసు వంటవార్పు, పిల్లల పెంపకం తప్ప'' అని అంటుంటారు. దాంతో మనం కూడా నిజమేనేమో అనుకుని ముడుచుకుపోతాం. అయితే ఈసారి ఎవరైనా అలా అంటే చిన్నబుచ్చు కోవలసిన అవసరం ఇంకేమాత్రం లేదు... అవే మంచి మేనేజర్ కావడానికి ముఖ్యమైన అంశాలని పరిశోధించి మరీ తేల్చిచెప్పారు.
క్లార్క్ యూనివర్సిటి, సెంటర్ ఫర్ క్రియేటివ్ లీడర్ షిప్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోదనలో తేలిన ఆసక్తికర విషయం ఆడవారిని ఆనందంలో ముంచేసింది బిడ్డల్ని పెంచడం లోని నైపుణ్యం, ఒక సంస్థ నిర్వహణలో నైపుణ్యం ఇంచు మించుగా దగ్గరగా ఉంటాయం టున్నారు. కాబట్టి తల్లిగా బాధ్యత నిర్వహి స్తున్న గహిణులు మంచి మేనే జర్గా రాణించగల అవకా శాలు ఎక్కువ అని పరిశోధకులు తేల్చారు.
మరో విషయం ఏమిటంటే చురుకైన సాధారణ వ్యక్తికన్న బహుముఖ సమస్యలతో బహుపాత్రాలని పోషించే వ్యక్తి విధి నిర్వహణలో మెరుగ్గా వుంటారని కూడా తేల్చారు ఈ పరిశో ధనలో. ఎందుకంటే వీరు అప్రమత్తంగా వుంటూ ప్రతి పనిని సక్రమంగా పూర్తి చేయ టానికి ప్రయత్నిస్తారు. దీన్నిబట్టి తేలిందే మిటంటే ఇల్లాలు, పిల్లల తల్లి, ఇంటి భాద్యతలు వంటి వేవి స్త్రీ పురోగతికి అడ్డంకి ఏమాత్రం కావని. పైగా అవే ఆమెని చురుగ్గా, మెరుగైన పని మంతురాలుగా తీర్చి దిద్దుతాయని.