Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా టాయిలెట్ బౌల్, మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.
బాత్రూంలో ఫోన్ వాడడం : కొందరికి బాత్రూంలో ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా... టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్, కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటి వల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం : హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్‌కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్‌కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్‌ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్‌ని పై నుండి లోపల యాంటీ బాక్టీరియా క్లాత్ తో తుడిచి వేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.
షూస్ ఎక్కువ సేపు ధరించడం : ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 శాతం షఉస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్‌కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.
రిమోట్‌ని శుభ్రపరచకపోవడం : మనం టీవీ రిమోట్‌ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే రిమోట్‌ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.
స్పాంజిని సరిగ్గా పిండకపోవడం : స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం. బబ