Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూర్
నకిరేకల్ నియోజకవర ్గబీజేపీ రెబల్ అభ్యర్థిగా గోలి ప్రభాకర్ ఈనెల 19న నామినేషన్ వేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాకి పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక సాంబయ్య తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నకిరేకల్ అభ్యర్థి విషయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంగడి మనోహర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని, ఇటీవల పార్టీలోకి వచ్చిన కాసర్ల లింగయ్యకు టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు. దళిత, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గోలి ప్రభాకర్ కృషి చేశారని ఆయనను కాదని లింగయ్యకు ఇవ్వడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముడుసు భిక్షపతి, గోలి ప్రభాకర్ పాల్గొన్నారు.