Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
బాలల హక్కుల పరిరక్షణ అందరిదని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి సుధా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఎం.కళావతి, జి.సునీత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, కుర్చీలాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.పృధ్వీరాణి మాట్లాడుతూ 14 ఏండ్లలోపు చిన్నారులలను పనిలో పెట్టుకోవడం, చదువుకు ఆటంకం కల్గించినవారిపై చట్టరిత్యా చర్యలు ఉంటాయన్నారు.18 ఏండ్లలోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్దమన్నారు. బాల్యవివాహలను ప్రోత్సహించిన వారికి జైలుశిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా ఉంటుందన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ 1098 సిబ్బంది రమణి, ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీ, ఉమా, అన్నపూర్ణ, విజయకుమారి, నీలిమా, భాగ్య, సునీత, లొడంగి లక్ష్మీ పాల్గొన్నారు.
కట్టంగూర్:మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రత్తమ్మ, సూపర్వైజర్లు సునీత, జ్యోతి, పాఠశాల ఎస్ఓ విజయశ్రీ, ఉపాధ్యాయులు, బాలల హక్కుల పరిరక్షణ విభాగం సిబ్బంది రమణి, సుధాకర్, ప్రవీణ్, శ్రీనివాస్ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ప్రేరణ
క్లాక్‌టవర్: పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ప్రేరణ కల్గిస్తాయని సిల్వర్మూన్ హైస్కూల్ పాఠశాల వ్యవహర్త అల్గుబెల్లి శ్యామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్మూన్ పాఠశాలలో చిన్నారులకు ఫ్యాన్సిడ్రస్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపేందర్, రఫీ, నాగయ్య, మంజుల, శంకర్, రమేశ్, హర్షియా, దీపిక, సుమలత, సుష్మిత, వేదశ్రీ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.