Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
హాలియా మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్ను వెంకటనారాయణరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తల పేర్లు వేర్వేరు వార్డులో రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటు నమోదు, వార్డుల విభజన కూడా అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఓటర్లకు న్యాయం చేయడం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మనాది రవీందర్‌యాదవ్, మండలశాఖ అధ్యక్షులు నాగార్జునరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కాకునూరు శ్రీనివాస్‌గౌడ్, కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జూలకంటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.