Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు కమిషనర్ ఎం. పూర్ణచందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు తీసుకునేందుకు ఆహార భద్రత కార్డు జీరాక్స్, ఆధార్‌కార్డులతో ఆయా వార్డులకు చెందిన వారికి చీరలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.1, 2 వార్డులకు గాను పట్టణంలోని మహాలకిë వృద్ధాశ్రమం సమీపంలో నేడు ఉదయం 9 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.3, 4, 5 వార్డులకు చెందిన వారికి ఆర్డీఓ కార్యాలయ సమీపంలో మంగళవారం, 6, 7, 9 వార్డులకు సరస్వతి శిశుమందిర్ సమీపంలో మంగళవారం, 8, 13, 14 వార్డులకు మార్కెట్‌యార్డు, 10, 11, 12 వార్డులకు మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో బుధవారం, 15 నుంచి 20 వార్డులకు కోదండరామాలయం, మున్సిపాలిటీలో గురువారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.