Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాలకు 1,33,895 బతుకమ్మ చీరలు వచ్చినట్టు ఆర్డీఓ లింగ్యానాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొండమల్లేపల్లి సబ్ మార్కెట్‌యార్డు నుంచి ఆయా మండలాలకు చీరలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. పీఏపల్లి మండలానికి 15,183, దేవరకొండకు 20,395, కొండమల్లేపల్లికి 9,755, గుండ్లపల్లికి 15,053, చందంపేటకు 11,273, నేరేడుగొమ్ముకు 7,143, చింతపల్లికి 15,742, నాంపల్లికి 13,228, మర్రిగూడ 11,691, గుర్రంపోడు 14,432 చీరలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు చీరల పంపిణీని పర్యవేక్షించాలని పేర్కొన్నారు.