Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్టీల్లో మగ్గుతున్న కార్మికులు
- వెట్టిలో బాల్యం
- రూ.కోట్లు గడిస్తున్న ఇటుక బట్టీల యజమానులు
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి జిల్లాలో 105 పైనే
నవతెలంగాణ-పెద్దవూర
జిల్లాలో ఇటుక బట్టీలు విచ్చలవిడిగా వెలుస్తున్నారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా పట్టించుకునే వారే లేరు. బట్టీల్లో కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారు. వారు రోజు పనిచేస్తే ఒక్కో కూలీకి యజమానులు రూ.200లు చెల్లిస్తున్నారు. ఇటుక బట్టీల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు పొగతో రోగాల పాలవుతున్నారు. కార్మికశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటుక బట్టీల వ్యవహారంపై 'నవతెలంగాణ అందిస్తున్న సమాచారహక్కు చట్ట కథనం
చిత్రంలో చూస్తున్న ఇటుక బట్టి సాగర్ తిరుమల గిరి మండలం అల్వాలకు వెళ్లే రోడ్డు ఎడమ వైపు మిర్యాలగుడానికి చెందిన రమణయ్యది. ఈ ఇటుక బట్టీల్లోని 3 యూనిట్లలో కాల్చే ఇటుకల నుంచి వెలుబడే పొగ దీనికి 100 మీటర్ల దూరంలో ఉన్న అల్వాల ఎక్సురోడ్ గ్రామాన్ని వరుసగా వారంనుంచి, పది రోజుల వరకు పొగ కమ్ముకుంటోంది. పొగను పీల్చడం వల్ల వృద్ధులు, యువకులు, పిల్లలు, అస్తమ, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారు.
మరో ఇటుక బట్టి పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండా గ్రామంలో అనుమతి లేకుండా వెలసినవి. ఈ ఇటుక బట్టీయజమానిపేరు మాదవరపు వీరనారాయణ దాదాపు ఇందులో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దినసరి కూలీ రూ.200 మాత్రమే ఇస్తున్నారు. అలాగే వీరి నివాసాలకు తగిన వసతులు లేవు. గాలి, వాన వస్తే అంతేసంగతులు ఈ ఇటుక బట్టీపై అధికారులు తనిఖీలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇంతే కాకుండా ఈ బట్టి పంటపొలకు అనుకోని పత్తి, కంది, వరి పొలాలకు నల్లటి పొగ, బూడిద పొలాలమీద పడి తెగుళ్లు సోకి దిగుబడులు తక్కువగా వస్తున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేదంటే ఎంత పెద్ద మొత్తంలో దందా నడుస్తుందో తెలుస్తుంది.
ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే
ఒక ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే, రెవెన్యూ, మైనింగ్, గ్రామ పంచాయతీ, విద్యుత్, కార్మిక శాఖ, రవాణా పర్మిషన్ అవసరం. కానీ ఒక లేబర్ పర్మిషన్ మాత్రమే తీసుకొని, యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక ఇటుక బట్టికి కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్లు లేవు. అయినా అక్రమంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో పెద్దవూర, సాగర్, తిరుమల గిరి మండలం, అనుముల, నిడమనూర్, పరిధిలో 80కి పైగా గ్రామలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 25 ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. కానీ, అనధికార సమాచారం ప్రకారం జిల్లాలో 150 వరకు ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలో తనిఖీలు చేసినా కార్మిక శాఖ, కేసులే నమోదు చేయలేదని వార్తలు వినబడుతున్నాయి. కార్మికశాఖలో కొందరి అధికారుల తీరు వల్ల జిల్లాలో అనధికారికంగా బట్టీలు నడుస్తున్నాయి. ఒక్క సాగర తిరుమలగిరి, నిడమనూరు మండలంలోనే అల్వాల అడ్డరోడ్, అల్వాల, పెద్దవూర, కుంకుడు చెట్టు తండా, గ్రామాల్లో10 ఇటుక బట్టీలు దర్జాగా నడిపిస్తున్నా కార్మికశాఖ పట్టించుకోవడం లేదు. సాగర్ తిరుమలగిరి, అనుముల మండలాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో 75 ఇటుక బట్టీలు అధికారుల అనుమతి లేకుండా కార్మికుల శ్రమను దోచుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలకు సమీపంగా నడుస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
ఇటుక బట్టీల్లో కార్మికుల శ్రమదోపిడీ
జిల్లాలో ఇటుక బట్టీల్లో కార్మికులు వెట్టిచాకిరి చేస్తున్నారు. యజమానులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఇటుక బట్టీల్లో పని కోసం వస్తున్న కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇతర రాష్ట్రాల కార్మికులు 800కి పైగా ఉంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న యజమాన్యాలు వారి ప్రతి రక్తపు బొట్టును పీల్చి రూ.లక్షలు, రూ.కోట్లు గడిస్తున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ రెట్టింపు పనిభారాన్ని కార్మికులకు అంటగడుతున్నారు.
అనారోగ్యం బారిన జనావాసాలు
తిరుమల గిరి సాగర్ మండలం, అల్వాల, అల్వాల ఎక్స్ రోడ్, గ్రామానికి సమీప ఇటుక బట్టీలు ఉండటంతో వాటి నుంచి వచ్చే పొగను స్థానికులు పీల్చడంతో రోగాల బారిన పడుతున్నారు.
ఒటుక బట్టీలలో మగ్గుతున్న బాల్యం
ఇటుకబట్టీలలో 12 ఏండ్లనుంచే చదువులకు దూరమై పని చేస్తున్నారు. కనీస సదుపాయాలు లేక, ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల కింద, ఇటుక బట్టీలు యజమానులపై కేసులు నమోదు చేసినా, చిన్నారుల బాల్యం పొగ మారుతుంది. మన జిల్లావాళ్ళు తక్కువగా ఉన్నా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆంధ్ర, ఒరిస్సా, ప్రాంతాల నుంచి వచ్చినవారే ఎక్కువగా వున్నారు. పిల్లల మిస్సింగ్ కేసులు నమోదవు తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది ఇటుక బట్టీలు యజమానులు మామూళ్లు ఇస్తున్ననట్టు సమాచారం.
అనుమతి లేని బట్టిలపై చర్యలు తీసుకుంటాం... డీటీ మల్లిఖార్జున పెద్దవూర
అనుమతి లేకుండా బట్టీలు నిర్వహి స్తున్నట్టు సమాచారం అందలేదు. రెవె న్యూ, మైనింగ్, విద్యుత్, పొల్యూషన్, కార్మిక, రవాణా వంటి అనుమతులు కావాలి. బట్టీలపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపడతాం. చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.
ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీ అనుమతి లేదు సర్పంచ్ కుంకుడు చెట్టుతండా...
కుంకుడు చెట్టు తండా పంచాయతీ పరిధిలో 3 ఇటుక బట్టీలు ఉన్నాయి. వారంతా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండానే యాడెచగనాడుపుతున్నారు. పంచాయతీ పరిధిలో 3 బట్టీలు ఉన్నాయి. గతంలో 4 సార్లు వెళ్లి చెప్పాము. అయినా పర్మిషన్ తీసుకోలేదు.1, 2 రోజుల్లో బట్టీల వారికి నోటీసులు జారీ చేస్తాము. ఉన్నతాది కారులకు ఫిర్యాదు చేస్తాం.