Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-3 నెలల గడువు కోరిన హౌంశాఖ
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి నిబంధనలను రూపొందించడానికి కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) మరో 3 నెలల గడువు కోరింది. సబార్డినెట్ లెజిస్లేషన్ కోసం సంబంధిత ఎంహెచ్ఎ స్టాండింగ్ కమిటీ ముందు ఈ విజ్ఞప్తి చేసింది. పార్లమెంటులో చట్టంగా రూపుదిద్దుకుని, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఒక బిల్లుకు ఆరునెలల్లో నిబంధనలను రూపొందించాలి. గతేడాది డిసెంబర్లో తీసుకొచ్చిన సీఏఏకు సంబంధించి ఆర్నెళ్ల గడువు ముగియడంతో దాని నిబంధనల రూపకల్పన ఎంతదాకా వచ్చిందని స్టాండింగ్ కమిటీ విచారణ చేసిన నేపథ్యంలో.. మరో మూడు నెలల గడువు కావాలని ఎంహెచ్ఎ కోరినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్టాండింగ్ కమిటీ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు.