Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నన్ అత్యాచార నిందితుడికి సుప్రీంలో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నన్ అత్యాచార కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. తనపై నమోదైన అత్యాచార ఆరోపణలను రద్దు చేయాలని కోరుతూ బిషప్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే, ఎఎస్ బొప్పన, వి రామ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. విచారణను ఎదుర్కో వలసిం దేనని స్పష్టం చేసింది. పలుమార్లు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని జలంధర్ బిషప్‌పై నన్ ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీనిపై తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలవగా, ఆ ఆరోపణలను రద్దు చేయాలని కోరుతూ ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 7న విచారణ చేపట్టిన కోర్టు.. బిషప్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. విచారణను ఎదుర్కో వలసిందేనని తెలిపింది.