Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాగల 3 రోజులూ వర్షాలు
అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రదేశాల్లో 13న అల్పపీడనం ఏర్పడే అవకాశా లున్నాయని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. అల్పపీడనం ఏర్పడేందుకు గల అవకాశాల్లో ప్రధానమైన ఉత్తర -దక్షిణ ద్రోణి ఉత్తర బీహార్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు, ఝార్ఖండ్, గాంగ్టక్ పశ్చిమబెంగాల్ వాయు వ్య బంగాళాఖాతం మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. పై రెండింటి ప్రభావం వల్ల ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వెల్లడిస్తున్నారు.