Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌తో సహ పలువురి పేర్లు
- నార్కోటెక్ విచారణలో వెలుగులోకి..
ముంబయి : డ్రగ్స్ కనెక్షన్లో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు బయట కొచ్చింది. ఎన్సీబీ విచారణలో దీపికతో సహ పలువురిపేర్లు బయటకొచ్చాయి. జయా సాహామేనేజర్ కరీష్మాతో దీపిక మాట్లాడి నట్టు.. డ్రగ్స్ కావాలని అడిగినట్టు వెలుగుచూడటంతో కలకలంరేపుతున్నది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ ఆత్మహత్యపై విచారణకొనసాగుతున్న వేళ బాలీవుడ్‌లోని పలువురు తారలపేర్లు బహిర్గతమయ్యాయి.వీరిలో శ్రద్ధకపూర్, రకూల్‌ప్రీత్‌సింగ్, సారాఅలీ ఖాన్ పేర్లు వెలుగుచూశాయి. బాలీవుడ్ టాప్యాక్టర్ దీపికకు డ్రగ్స్ కనెక్షన్ తో లింకులున్నట్టు ఎన్సీబీ గుర్తించింది. వాట్సాప్ చాట్ ద్వారా దీపిక డ్రగ్స్‌ను అడిగినట్టు ఎన్సీబీ టీమ్ పరిశీలనలో తేలింది.