Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వ్యవసాయ రంగంలోని సన్నకారు రైతులకు సహకరించేందుకు వీలుగా బేయర్తో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదర్చుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బేయర్కు సంబంధించిన 'బెట్టర్ లైఫ్ ఫామింగ్' ప్రోత్సాహాంలో భాగంగా గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక పరిష్కారాలు అందించనున్నట్లు పేర్కొంది. చైక ధరల్లో రుణాలు, డిపాజిట్లు, ఉపసంహరణలు, చెల్లింపులు తదితర పూర్తి సేవలను అందించనున్నట్లు తెలిపింది.