Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుహవతి : అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల హెరాయిన్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇస్మాయిల్ అలీ అనే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి భాస్కర్ జ్యోతి మహంతా సోమవారం మీడియాకు తెలిపారు. గతేడాది నుండి అక్రమ డ్రగ్స్ కేసులపై చర్యలు చేపడుతున్నామని, అయితే ఇంత పెద్ద మొత్తంలో
డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని అన్నారు. పట్టుబడిన హెరాయిన్ నాణ్యత గ్రేడ్1 రకానికి చెందినదని, దీంతో వీటి విలువ 25కోట్ల వరకు ఉండవచ్చని చెప్పారు. అసోం-నాగా లాండ్ సరిహద్దులోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఇంఫాల్ వెళ్తున్న ట్రక్కు నుండి వీటిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.