Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోయిడా : ఓ బెలూన్ ఉత్తరప్రదేశ్ ప్రజలను బెంబేతెత్తించిందంటే నమ్ముతారా.. బెలూన్ భయపెట్టడేమేమిటీ అనుకుంటున్నారా.. ప్రముఖ కాల్పనిక క్యారెక్టర్ ఐరన్ మాన్ రూపంతో రూపొందించిన బెలూన్ ఒకటి యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ధన్కర్ పట్టణంలో దర్శనమిచ్చింది. దీంతో ఏదో గ్రహంతరవాసి వచ్చిందనుకుని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్‌తో నిండిన ఆ బెలూన్ శనివారం ధనకర్ మీదుగా భట్టా పార్సాల్ గ్రామానికి దగ్గరలోని ఒక కాలువలో పడింది. అది ఎగురుకుంటూ రావడం ..కాలువలో నీటి ప్రవాహానికి కదలడంతో గ్రామస్థులు గ్రహంతర వాసి ఏదో వచ్చిందనుకొని తొలుత భయపడ్డా..తర్వాత ఏంటిదోనని ఆత్రుతగా చూసేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. మామూలుగా బెలూన్ అయినా.. ఏదో ఆకారంలో ఉన్న జనాలకు అవగాహన ఉంటుందని, కానీ ఈ బెలూన్ కూడా కొంచెం వింత..వింత రంగుల్లో ఉండటంతో గ్రహంతర వాసేనని ప్రజలు భయపడ్డారని చెప్పారు.