Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్రిటన్ ఆమోదించిన పి ఫైజర్ టీకా భారత్‌లో ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని ఫి ఫైజర్ సంస్థ చెబుతోంది. భారత్‌లో వ్యాక్సిన్‌కు ఆమోదం తెలపాలంటే ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. అయితే, ఇందుకు సంబంధించి ఫైజర్ కానీ దాని భాగస్వామ్య కంపెనీలు ఎటువంటి ట్రయల్స్‌కు అనుమతి కోరలేదు. ఇప్పుడు ఇక్కడ సంస్థలతో ఒప్పందాలు కుదిరి, భారత్ అనుమతి పొందడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. స్థానికంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన సంస్థలను వెనక్కు నెట్టే అవకాశం భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌కు ఉన్నప్పటికీ..ఇప్పటికే పలు వ్యాక్సిన్లు మూడు దశల ట్రయల్స్ పూర్తి చేసినందున ఫైజర్ వైపు భారత్ అంతగా మొగ్గు చూపకపోవచ్చు. అంతేకాకుండా ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌లోకి వచ్చేందుకు మరిన్ని నెలలు పట్టవచ్చు.