Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం
బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి అటవీప్రాంతంలో శుక్రవారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ అనుబంధ యూనిట్ కోబ్రా ఆపరేషన్ నిర్వహిం చారు. హక్వా గ్రామ సమీపంలో గాలింపు చర్యలు చేపడుతుండగా... ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో పరిశీలించగా ఓ మృతదేహం లభించింది. మావోయిస్టు గంగలూరు ఏరియా కమిటీ మిలిషియా ప్లాటూన్ కమాండర్ అర్జున్‌గా గుర్తించారు. భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామనీ, మావోయిస్టుల ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.