Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సాగు చట్టాలపై స్టే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సాగు చట్టాలపై స్టే

Wed 13 Jan 01:51:11.837588 2021

- నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ : సుప్రీం
- ట్రాక్టర్‌ ర్యాలీపై రైతు సంఘాలకు నోటీసులు
- ఉద్యమాన్ని దెబ్బతీసేలా కేంద్రం కుట్ర : రైతు సంఘాలు
- చట్టాలకు మద్దతిచ్చిన వారితో కమిటీనా? : అన్నదాతలు
- ఆందోళన కొనసాగుతుంది : ఏఐకేఎస్‌సీసీ
- 26న దేశవ్యాప్తంగా కిసాన్‌ పెరేడ్‌
               మోడీ సర్కారు ఆమోదించిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రైతు సంఘాలు కమిటీకి తమ వాదనలు వినిపించాలని కోరింది. ఈ ప్రతిపాదనను అన్నదాతలు తిరస్కరించారు. కమిటీ ఏర్పాటును తాము కోరలేదని స్పష్టం చేశారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులంతా మోడీ సర్కారు అనుకూలురేననీ, వారెవరూ ప్రస్తుత రైతు పోరాటంలో భాగస్వాములు కాదని తేల్చిచెప్పారు. సుప్రీం విధించిన స్టేను ఎప్పుడైనా ఎత్తివేయవచ్చనీ, న్యాయస్థానం ద్వారా చట్టాలను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నదంటూ రైతుసంఘాల నేతలు చెప్పారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేననీ, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. జనవరి 26న దేశవ్యాప్త కిసాన్‌ పరేడ్‌ నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. దీనిపై కూడా సుప్రీంకోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
కమిటీ సభ్యులు వీరే..
భూపేందర్‌ సింగ్‌ మాన్‌ (బీకేయూ అధ్యక్షుడు), ప్రమోద్‌ కుమార్‌ జోషి (డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, 2012-2019), అశోక్‌ గులాటీ (వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్‌ ఘావంత్‌(షెట్కారీ సంఘటన, మహారాష్ట్ర) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అశోక్‌ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌కు గతంలో చైర్మెన్‌గా వ్యవహరించారు. ప్రమోద్‌ జోషి జాతీయ వ్యవసాయ అకాడమీ సంచాలకులుగా పనిచేశారు. అయితే, ఈ కమిటీ ఉద్దే శం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదనీ, కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని స్పష్టంచేసింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థి తులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. కమిటీ ని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. రైతుల సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నామనీ, అందు కోసమే ఈకమిటీ అనిపేర్కొంది. రైతుల ప్రతినిధులు, ప్రభుత్వం తో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈసందర్భంగా పేర్కొంది. 'అందరి కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మాకు నివేదిక సమర్పించేందుకే ఈ కమిటీ. రైతు సంఘాలు సహకరించాలి. సమస్య పరిష్కారం కోసం ఇరు పక్షాలు కమిటీని సంప్రదించాలి. కమిటీని నియమించడంతో పాటు... చట్టాలను నిలిపివేసే అధికారం కూడా మాకున్నది. అయితే ఇప్పుడు స్టే విధించామే తప్ప.. చట్టాలను నిరవధికంగా నిలిపివేయబోవటం లేదు. ఒకవేళ రైతు సంఘాలు కమిటీకి సహకరించకపోతే.. ప్రధానిని ఏదైనా చెయ్యమని మేం అడగలేం కదా' అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
పరిష్కారం కావాలంటే కమిటీ ముందుకు రావాలి...
సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరపున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే, కోర్టు ఏర్పాటుచేసే ఏ కమిటీ ముందుకూ తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు వారి తరఫు న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ధర్మాసనానికి విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ... ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అన్నదాతలు చట్టాల రద్దుకే పట్టుబడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గరకు వెళ్లగలిగినప్పుడు కమిటీ ముందుకు రావడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎటువంటి పరిష్కారం లేకుండా ఆందోళన చేయవలసి వస్తే.. అది నిరవధికంగా కొనసాగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. ''రేపు చనిపోవడానికి బదులు నేడే మరణించడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రకటించారు'' అని న్యాయవాది శర్మ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని జీవన్మరణ సమస్యగా పరిగణించడం లేదని తెలిపింది. చట్టం చెల్లుబాటు పైనే విచారణ జరుగుతుందని తెలిపింది. మిగిలిన సమస్యల్ని కమిటీ ముందు లేవనెత్తాలని కోరింది.
ఖలిస్థానీలు చొరబడ్డారు: కేంద్రం
అలాగే రైతుల నిరసనలపై కేంద్రం చేసిన ఆరోపణల్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. అన్నదాత ఉద్యమం వెనుక అసాంఘిక శక్తులు, నిషేధిత సంస్థల ఉనికి ఉందన్న ఆరోపణలపై ఏం చెబుతారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ ఆరోపణలను ధ్రువీకరిస్తారా? నిరాకరిస్తారా? అని నిలదీసింది. రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తున్నదంటూ ఓ దరఖాస్తు తమ ముందున్నదని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్‌ దీనిని అంగీకరిస్తారా, కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.
రైతు సంఘాలకు నోటీసులు..
జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై సుప్రీం కోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్ల కవాతును నిషే ధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఢిల్లీ పోలీసు విభాగం ద్వారా ఈ వ్యాజ్యం దాఖలు చేయించింది. దీనిపై వివరణ ఇవ్వాలని రైతు సంఘాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ సోమవారం చేపడతామని తెలిపింది. ఇదిలా ఉండగా రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ట్రాక్టర్ల ర్యాలీపై హౌం శాఖదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పింది.
చట్టాలకు, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన
వారితో కమిటీనా..?
కమిటీలో ఉన్న నలుగురు సభ్యులు రైతు వ్యతిరేక చట్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారే. అలాగే కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నవారే.
1. భూపేందర్‌ సింగ్‌ మాన్‌ (బీకేయూ అధ్యక్షుడు). ఈయన రైతు ఉద్యమంలో భాగస్వామ్యంలేని చిన్న రైతు సంఘానికి చెందిన అధ్యక్షుడు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను గత నెలలో కలిసిన ఈయన రైతు చట్టాలకు మద్దతు తెలిపారు.
2. ప్రమోద్‌ కుమార్‌ జోషి, ఈయన 2012-2019 వరకు ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కార్పొరేట్లకు, నయా సరళీకరణ విధానాలకు మద్దతు ఇచ్చే వ్యక్తి.
3.అశోక్‌ గులాటీ, మోడీ సర్కార్‌కు మద్దతునిచ్చే వ్యవసాయ శాస్త్రవేత్త. నయా ఉదారవాద విధానాలను సమర్థిస్తారు. చట్టాలకు మద్దతుగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యాసాన్ని కూడా రాశారు. సామాన్యుని నడ్డి విరిచిన పెద్ద నోట్ల రద్దుకు ఆయన ప్రసంశలు కురిపించారు.
4. అనిల్‌ ఘావంత్‌, షెట్కారీ సంఘటన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన నూతన వ్యవసాయ చట్టాలు మహౌన్నత సంస్కరణలు అని కితాబు నిచ్చారు. కొత్త చట్టాలను సమర్థించిన ఈయన వ్యవసాయ రంగం స్వేచ్ఛకు హామీ ఇస్తాయని ప్రశంసించారు.
కమిటీ వేయాలని మేం అడగలేదు : వెనక్కి తగ్గని రైతులు
సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా ఢిల్లీ కేంద్రంగా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేస్తేనే వెనక్కి వెళ్తామని స్పష్టం చేశారు. కమిటీ వేయాలని తాము అడగలేదని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత దర్శన్‌ పాల్‌ స్పష్టంచేశారు. తాము ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలనీ, తాము ఏ కమిటీని అంగీకరించమని తెగేసి చెప్పారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు మాట్లాడారు. ''మేము ఎప్పుడూ సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు.
మేము ఎప్పుడూ పిటిషన్‌ దాఖలు చేయలేదు. సుప్రీం కోర్టు ద్వారా ప్రభుత్వం తన విధానాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. కమిటీ సభ్యులందరూ ఈ చట్టాన్ని సమర్థించినవారే'' విమర్శించారు. ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చిందనీ, ఆ చట్టాలను ప్రభుత్వమే రద్దు చేయాలనీ, తాము ఈ కమిటీని అంగీకరించబోమని స్పష్టం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ
లవ్‌ జిహాద్‌ యూపీ అభ్యర్థనకు సుప్రీం తిరస్కరణ
వాట్సాప్‌ పై కేంద్రం ఫైర్‌
సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ
తెలంగాణకు రూ.1,336.44 కోట్లు జీఎస్టీ పరిహారం
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాలు
ఏపీలో స్థానిక పోరుకు పచ్చజెండా
కిసాన్‌ జవాన్‌ పరేడ్‌
కదిలిన రైతు దండు
మోడీ పర్యటనకు ముందే..
సుప్రీం ముందుకు..
నేతాజీ అన్ని మతాలనూ గౌరవించారు
ఇది ప్రజా ఉద్యమం
టీకా సరఫరాలో అసమానతలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలం
షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం
అందరి చూపు సుప్రీం వైపు
మీరే మోడీని ఒప్పించాలి
పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు
యూపీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
రద్దు చేయాల్సిందే
పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
అన్నిదారులు ఢిల్లీ వైపే
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.