Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 ఏండ్ల రికార్డు బ్రేక్..
- మైనస్ మూడు డిగ్రీల వాతావరణం
న్యూఢిల్లీ : సహారా ఎడారిలో సాధారణ ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటుంది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 50 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో మంచుకురుస్తుంది. ఆఫ్రికా,మధ్యప్రాచ్యదేశాల్లోని ఏడారుల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అయితే ఈ సారి తెల్లటి మంచు దుప్పటి కప్పినట్టు కనిపిస్తున్నది. సౌదీ అరేబియాలోని అసీర్ ప్రాంతంలో మంచు కురిసింది. దీంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఈ అందాలను తిలకించటానికి పర్యాటకులు తరలివస్తున్నారు.
15 ఏండ్లలో పచ్చదనం..
సముద్ర మట్టం నుంచి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉండటం...అట్లాస్ పర్వతం ఉన్న ప్రాంతం కావటంతో ఏడారికి ద్వారంలా ఉన్నది. ఉత్తర ఆఫ్రికాలోని ఎక్కువ భాగం ఏడారి ప్రాంతం విస్తరించిఉన్నది. వేల ఏండ్ల నుంచి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నతీరుపై చర్చనడుస్తున్నది. ప్రస్తుతం ఐన్సెఫరా బీడులా కనిపిస్తున్నా...తేమ కారణంగా వచ్చే 15 ఏండ్లలో ఏడారి ప్రాంతమంతా పచ్చగా మారబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు.