Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు సీబీ-సీఐడీ ఎఫ్ఐఆర్
- లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు
చెన్నై : మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేశ్ దాస్‌పై తమిళనాడు క్రైం బ్రాంచ్ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఓ మహిళా ఐపీఎస్ అధికారి ఆరోపణలపై సీఐడీ ఈ చర్యకు ఉపక్రమించింది. దీంతో రాజేశ్ దాస్‌పై ఐపీసీలోని సెక్షన్ 354తో పాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా, ఎఫ్ఐఆర్లో చెంగల్పట్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీ కన్నన్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి చెన్నైకి వెళ్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని ఆపడానికి కన్నన్ ప్రయత్నించాడన్నది ఆరోపణ. కాగా, రాజేశ్ దాస్ తన పై అధికారి అయినందున ఆయన ఆదేశాల మేరకే తాను అలా చేశానని కన్నన్ వెల్లడించడం గమనార్హం. అయితే, తనపై వచ్చిన అన్ని ఆరోపణలను రాజేశ్ దాస్ తోసిపుచ్చారు. తమిళనాడు డీజీపీ జేకే త్రిపాఠి ఆదేశాల మేరకే సీబీ-సీఐడీ.. రాజేశ్ దాస్‌పై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది.
మహిళా అధికారి చేసిన ఫిర్యాదుపై దృష్టిసారించడం కోసం లైంగిక వేధింపుల చట్టం ప్రకారం.. అంతర్గత ఫిర్యాదుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాగా, ఇదే కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ లను ఆదేశించింది.