న్యూఢిల్లీ : దేశ ఆస్తులను ఆమ్మే పనిపెట్టుకున్న కేంద్రంలోని ప్రభుత్వం పోర్టులను కూడా ప్రయివేటీకరణ దిశగా తీసుకుపోతున్నది. దీనికి సంబంధించి ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో ఒక చట్టం చేసిన ప్రభుత్వం..తాజాగా దాని కొసాగింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన మారిటైమ్ సదస్సు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ఆ తరహా 'ఆహ్వానాలు' పంపారు. పోర్టు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలకు ఆయన ఆహ్వానాలు పలికారు.