Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీ బయటపెట్టిన సామాజిక కార్యకర్త
- కర్నాటక రాజకీయాల్లో కలకలం
బెంగళూరు : కర్నాటకలో బీజేపీ మంత్రి సెక్స్ టేప్‌లో అడ్డంగా దొరికాడు. ఓ మహిళతో ఆయన రాసలీలలు సాగుతున్న వీడియో బయటకు వచ్చింది. యడియూరప్ప క్యాబినెట్‌లోని మంత్రి రమేష్ జరకిహౌలి ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు ఈ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి దినేష్ మలహల్లి అనే ఆర్టీఐ కార్యకర్త కబ్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయకుండా, అంతర్గత విచారణ జరుగుతున్నదని చెప్పారు. గతంలో హెచ్ డీ కుమారస్వామి సర్కార్ కూలిపోవడంలో రమేశ్ జరకీహౌలీ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపునకు తీసుకెళ్లటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాతే బీఎస్ యడియూరప్ప కర్నాటక సీఎం అయ్యారు. రమేష్ జరకలిహౌలికి ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖను కేటాయించారు.
సామాజిక కార్యకర్త, నాగరిక హక్కు పోరాట సమితి దినేశ్ కలహళ్లి దీనికి సంబంధించి లేఖనూ విడుదల చేశారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశాననీ, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ వద్దకు తీసుకుని వెళ్తానని చెప్పారు. మంత్రి బాధితులు తన వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారని అందుకే తాను దీన్ని బయట పెట్టానని చెప్పారు.