Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది నిరుద్యోగ నమోదులో 20 రెట్లు పెరుగుదల
- 'ఎంపీ రోజ్గర్ పోర్టల్‌లో భారీగా రిజిస్ట్రేషన్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగిత భారీగా పెరుగుతున్నదని ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుద్యోలకు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''మధ్యప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ వెబ్సైట్'' (ఎంపీ రోజ్గర్ పోర్టల్)లో ఈ ఏడాది నిరుద్యోగ నమోదు దాదాపు 20 రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో 7,73,489 మంది నిరుద్యోగులు స్టేట్ ఎంప్లారు మెంట్ ఎక్సేంజ్‌లో నమోదు చేసుకోగా, 2020 ఇదే కాలంలో 41,276 మంది నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో 5.12 లక్షల మంది, ఫిబ్రవరి 25 వరకు 2.60 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో 5.12 లక్షల మంది నమోదు కాగా, 2019లో 8.45 లక్షల మంది నమోదు చేసుకున్నట్టు మధ్యప్రదేశ్ ఎంప్లారు మెంట్ ఎక్సేంజ్ వెబ్ సైట్ డేటా పేర్కొంది. ఇందులో నమోదైన 7.73 లక్షల మంది నిరుద్యోగుల్లో 30 శాతం మంది మహిళలున్నారు. కేటగిరీల వారిగా 3.1 లక్షల మంది ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు, 1.87 లక్షల మంది జనరల్ కేటగిరీల వారున్నారు. షెడ్యూల్ తెగ, షెడ్యూల్డ్ కులాలవారు 2.65 లక్షల మంది ఉన్నారని డేటా పేర్కొంది.
కాగా, తాజా అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం నమోదు చేసుకున్న 26.82 లక్షల మంది 21.5 లక్షల మంది అక్షరాస్యులు ఉన్నారు. జిల్లాల వారిగా అత్యధికంగా గ్వాలియర్‌లో 35,443 మంది, మోరెనాలో 32,236 మంది, రెవా, ఇండోర్లలో ఒక్కొక్కటిలో 29,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కాగా, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడంపై నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ''మోడీ జాబ్ డూ'' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో హౌరెత్తించారు. ఈ హ్యాష్ ట్యాగ్ వరుసగా ట్రెండ్‌లో ఉండటం గమనార్హం. నిరుద్యోగితపై బెరోజ్గర్ సేన సభ్యులు, సామాజిక కార్యకర్త అక్షరు హుంకా మాట్లాడుతూ.. తమ అంచనా ప్రకారం మధ్యప్రదేశ్‌లో 70 శాతం కంటే ఎక్కువ యువత నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగానే యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడానికి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందని హుంకా పేర్కొన్నారు.