Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలిండర్ గ్యాస్ ధరల పెంపుతో పాత జీవితంలోకి..
- ఇంటి అద్దెకు సమానంగా సిలిండర్ ధర.. ఏం చేయాలి !
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు సామాన్యుడిపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయనే దానికి పలు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు వాడే ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరల పెంపు స్టవ్‌ను వెలిగించకుండా చేస్తున్నది. చివరికి మళ్లీ కట్టెల పొయ్యికి మారే విధంగా చేస్తోంది. దీనికి ఉదాహారణే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద లబ్ది పొందిన 8 కోట్ల మహిళ కథ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి చెందిన ఆయేషా షేక్.. 2019 సెప్టెంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందుకున్నారు. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచడంతో దాన్ని కొనే స్తోమత లేక, వేరే గత్యంతరం లేక ఆమె తిరిగి మళ్లీ కట్టెల పొయ్యికి మారారు.
గ్యాస్ సిలిండర్ ధరపై ఆయేషా షేక్ మాటల్లో. 'మా ఇంటి అద్దె కంటే గ్యాస్ సిలిండర్ ధరే ఎక్కువగా ఉంది. మేం నెలకు రూ.600 ఇంటి అద్దె చెల్లిస్తున్నాం. కానీ గ్యాస్ ధర రూ.700కుపైనే ఉంది. మేమే ఏం చేయాలి? గ్యాస్ సిలిండర్ కొనాలా లేక ఇంటిఖర్చులు చూసుకోవాలా?' అని ఆమె ఓ న్యూస్ ఛానల్ ఎదుట వాపోయారు. గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో దానిని రీఫిల్ చేసుకునే స్థోమత లేకపోవడంతో మళ్లీ తిరిగి కట్టెల పొయ్యికి మారినట్టు ఆయేషా చెప్పారు. ఉజ్వల పథకం కింద లబ్ది పొందిన మరో మహిళ మండబాయి పాబ్లేది కూడా ఇదే పరిస్థితి. ఔరంగాబాద్‌లోని లోహౌగావ్లో నివసించే ఆమె.. ''పేరుకే
అది ఉచిత కనెక్షన్. ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌ను భరించే స్థితిలో లేం'' అని తెలిపారు. పెరిగిన ధరలకు తోడూ డోర్ డెలివరీ సౌకర్యం లేకపోవడంతో అదనంగా రవాణా ఖర్చులు కూడా భరించాల్సి వస్తుందని వాపోయారు. ఔరంగాబాద్‌లో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.828 గా ఉంది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,642 గా ఉంది.