న్యూఢిల్లీ : నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ), నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎఇ) తుది ఫలితాలను శనివారం యుపిఎస్‌సి ప్రకటించింది. 533 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాత పూర్వక పరీక్షలను సెప్టెంబర్ 6, 2020 నిర్వహించినట్లు, తరువాత ఇంటర్వ్యూలను సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బి) జరిపిందని యుపిఎస్‌సి తెలిపింది. తుదిఫలితాలు యుపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.