న్యూఢిల్లీ : తమ డెస్క్‌టాప్ యాప్‌తోనూ వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. గత ఏడాదిలో వాట్సాప్ యాప్‌తో ప్రజలు ఒకరి నుంచి ఒకరు కాల్ చేసుకోవడం గణనీయంగా పెరగడం గమనించామని, రికార్డు స్థాయిలో కేవలం ఒక్క రోజులోనే 140 కోట్ల మంది వాయిస్, వీడియో కాల్స్ చేసుకున్నారని వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. అందువలనే డెస్క్‌టాప్‌లపైనా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది.