Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ సోదాలపై తాప్సీ
న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా తన ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ ) అధికారులు జరుపుతున్న సోదాలపై బాలీవుడ్ నటి తాప్సీ స్పందించారు. ఈ మేరకు ఆమె మూడు వరుస ట్వీట్లను చేశారు. గత మూడు రోజులుగా జరిగిన ఐటీ సోదాల్లో మూడు విషయాలను ఆమె వివరించారు. ప్యారీస్‌లో తనకు బంగ్లా ఉన్నదన్న విషయం అవాస్తవమనీ, తనకు
అలాంటిదేమీ లేదని మొదటి ట్వీట్లో పేర్కొన్నారు. తనకు ఐదు కోట్ల రూపాయల చెల్లింపు జరిగిందనీ, వాటికి సంబంధించిన రశీదుల గురించి జరిగిన సోదాలపై స్పందిస్తూ.. తాను మాత్రం ఆ మొత్తాన్ని తీసుకోలేదనీ, అలాంటి చెల్లింపే జరగలేదని వివరించారు. ఇక ఆర్థిక మంత్రి చెప్పినట్టుగా 2013లో తన ఇంటిపై ఎలాంటి సోదాలూ జరగలేదని మూడో ట్వీట్లో తాప్సీ పేర్కొన్నారు. తాప్సీ పన్నుతో పాటు సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వావరి బంధువుల ఇండ్లపై ఈనెల 3 నుంచి ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.