Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని బందిపోరా జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న ఓ పార్టీని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులు జరిపారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజరు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కాశ్మీర్లో బందిపోరా జిల్లాలో పోలీసులు జరుపుతున్న పార్టీపై గుర్తుతెలియని మిలిటెంట్లు కాల్పులు జరపగా.. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.