Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేట్ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటిసారి నష్టాలను మూటకట్టుకుంది. విలీనమైన బ్యాంకుల మొండి బాకీలన్నీ కలిసి స్టేట్ బ్యాంకును కృంగతీశాయి.
- హేతుబద్దీకరణ పేరుతో దగ్గరదగ్గరగా ఉన్న సుమారు 7వేల శాఖలను మూసివేశారు.
- దానికి తగినట్టుగా 15,000కు పైగా ఉద్యోగాల సంఖ్యను కుదించారు. గత ఏడేళ్లలో ఎక్కువ ఉద్యోగాలను కల్పించింది బ్యాంకింగ్ రంగం. ఆ రంగంలో కీలకమైన స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఉద్యోగ నియామకాలను నిలిపివేసింది.
- విలీనం తరువాత ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకులో భారతీయ స్టేట్ బ్యాంక్ చేరిందని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ స్థాయి బ్యాంకుకి ప్రపంచ స్థాయి వ్యాపారమే ముఖ్యం. అందుకే విలీనం తరువాత సేవింగ్స్ తదితర ఖాతాలలో కనీస నిల్వల పరిమిత విపరీతంగా పెంచింది. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుండి అపరాధ రుసుం వసూలు ద్వారా రూ. 2000 కోట్లు ఖాతాదారుల మీద భారం మోపింది. లక్షల చిన్న చిన్న ఖాతాలు ఇతర బ్యాంకులకు తరలిపోయాయి.
- స్టేట్ బ్యాంకులో విలీనమైతే ఆ బ్యాంకులో ఉన్న అదనపు జీతభత్యాలు తమకు కూడా వర్తిస్తాయని ఉద్యోగులు బావించారు. కానీ విలీనమైన బ్యాంకులో కాని, విలీనం చేసుకున్న స్టేట్ బ్యాంక్లో కానీ ఎక్కడ తక్కువ సదుపాయాలుంటే వాటినే ఉద్యోగులకు వర్తింపజేసింది. చేసేది లేక ఉద్యోగులు న్యాయం కోసం హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు