Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ ప్రయివేటు బ్యాంకుల చరిత్ర
- 1947- 1969 మధ్య 559 బ్యాంకుల దివాళా
- 1969-2020 మధ్య అదే బాటలో మరో 38 బ్యాంకులు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు బిజెపి సైద్ధాంతికంగా బద్ధ వ్యతిరేకి. 1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేస్తూ పార్లమెంటులో చట్టం తెచ్చి నప్పుడు బిజెపి పూర్వ అవతారమైన భారతీయ జనసంఫ్‌ు దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. వాజ్‌పేయి నేతృత్వంలోని మునుపటి ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాలను 33 శాతానికి కుదిస్తూ 2000 డిసెంబరులో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఎస్బిఐ వంటి ఒకటి రెండు మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటినీ ప్రైవేటు పరం చేసేందుకు పూనుకుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్నటి బడ్జెట్లో ప్రకటించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ప్రభుత్వ వాటాను పూర్తిగా ఉప సంహరించుకోవడంతో అది ప్రైవేట్ పరమైంది.
1947 నుంచి 1969 మధ్య 559 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు దివాళా తీశాయి. దీంతో లక్షలాది మంది సాధారణ ప్రజానీకం దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము లూటీకి గురైంది. 1969 తరువాత కూడా ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీసిన ఉదాహరణలనేకం ఉన్నాయి. 1993లో పది కొత్త తరం బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఏర్పడగా వీటిలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుతో సహా అయిదు బ్యాంకులు ఇప్పటికే దివాళా తీశాయి. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 25 ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీయడమో, ఇతర బ్యాంకుల్లో విలీనం కావడమో జరిగింది. ఐడిబిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యుటి, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్, టైమ్స్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, హిందూజాల ఇండస్ ఇండ్ బ్యాంక్‌లు ప్రైవేట్ రంగంలో ఏర్పాటుకు లైసెన్స్లివ్వగా ఇండస్ ఇండ్ మినహా మిగతావన్నీ ఏదో ఒక బ్యాంకుతో విలీనమయ్యాయి.
2004లో న్యూ జెనరేషన్ బ్యాంక్‌గా పేరొందిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు పీకల్లోతున కుంభకోణాల్లో కూరుకుపోయింది. దాని నష్టం వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. దివాళా తీసిన ఆ బ్యాంకును తీసుకెళ్లి ఓరియంటల్ బ్యాంక్‌లో బలవంతంగా విలీనం చేశారు. ప్రైవేట్ రంగ బ్యాంకులు దివాళా తీస్తే వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేస్తున్నారు. లాభాలు ప్రైవేట్ పరం, నష్టాలు జాతీయం చేయడమంటే ఇదే.
జిటిబి తరువాత యస్ బ్యాంకు, ఐసిఐసిఐ, కో-ఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ , లక్ష్మీ విలాస్ బ్యాంకులు అక్రమాలు పెద్దయెత్తున చోటు చేసుకున్నట్లు తేలింది. అలాగే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేేషన్లు ఈ అవినీతి కుంభకోణాల్లో ఒకదానితో ఒకటి పోటీపడ్దాయి. ఐసిఐసిఐ బ్యాంక్ సిఇవో హోదాలో చందా కొచార్ తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ బ్యాంకు నుంచి వీడియోకాన్‌కు భారీగా రుణాలు మంజూరు చేయడం వెనక క్విడ్ ప్రో కో భాగోతం నడిచింది. ఆమె భర్త దీపక్ కొచార్కు వీడియో కాన్ నుంచి పెద్దయెత్తున ముడుపులు ముట్టాయని తేలింది. యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చి, వాటి నుంచి తన కుటుంబ సభ్యులకు ముడుపులు ముట్టేలా చూసుకున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంకు అవినీతి భాగోతం కూడా ఇటువంటిదే. ఆ బ్యాంకు యజమాని రాన్‌బాక్సీ, ఫోర్టిస్ గ్రూపు మాజీ ప్రమోటర్లయిన తన ఇద్దరు సోదరులు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్‌లకు దొడ్డిదారిన రు. 723 కోట్ల రుణాలు మంజూరు చేశారు. మోసం, విశ్వాస ఘాతుకం నేరాల కింద ఆ బ్యాంకు యజమాని ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. 2019 సెప్టెంబరు 4న ఐఎల్ అండ్ ఎస్ఎఫ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సిడ్బి నుంచి స్వల్పకాలిక రుణం కింద వెయ్యి కోట్లు తీసుకున్న ఐఎల్ఎఫ్ ఎస్ దానిని తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. ఈ ప్రైవేట్ బ్యాంకుల మోసాలు, కుంభకోణాల గురించి వివరిస్తే అదొక ఉద్గ్రంథమే అవుతుంది. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్మును తమ సొంత బొక్కసాలు నింపుకోవడానికే యథేచ్ఛగా లూటీకి పాల్పడుతూ, దేశాన్ని ఆర్థిక అస్థిరత వైపు నెడుతున్నాయి.
2008 సెప్టెంబరులో తలెత్తిన ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో 494 ప్రైవేట్ రంగ బ్యాంకులు కుప్పకూలాయి. దీంతో వాటిని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ పేరుతో పెద్దయెత్తున రాయితీలు ఇచ్చింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును కుప్పకూలిన ఈ రాకాసి ప్రైవేట్ బ్యాంకులకు నైవేధ్యంగా ప్రభుత్వం సమర్పించింది. పొరుగున వున్న చైనాను తీసుకుంటే అక్కడ ఫైనాన్స్ రంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారితో సహా ఎలాంటి విపత్తునైనా తట్టుకునేలా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తయారైంది. వచ్చే పదేళ్లలో ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతోంది. మన దేశంలో బ్యాంకుల జాతీయీకరణ తరువాత ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించగలిగాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి. పెరుగుతున్న దేశ జనాభాకనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచీలను విస్తరించాల్సింది పోయి, కుదించే కార్యక్రమం ప్రభుత్వాలు చేపడుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో సగటున లక్షమందికి 40 బ్రాంచీలు ఉండగా, మన దేశంలో 7 బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి. సంస్థాగత రుణాలందక గత 15 ఏళ్లలో 3లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే రైతాంగ ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాద ముంది.
ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు రైతాంగం పాలిట ఉరి తాళ్లుగా మారాయి. కాబట్టి ఈ ప్రమాదకర చర్యకు వ్యతిరేకంగా అటు రైతాంగం, ఇటు బ్యాంకు ఉద్యోగులు, వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రశక్తులు అందరూ ఐక్యంగా ఉద్య మించాల్సిన అవసరముంది. ఐక్య ఉద్యమాల ద్వారా మోడీ ప్రభుత్వం మెడలు వంచాలి.
ప్రైవేటు బ్యాంకుల విలీనం ఇలా...
సంవత్సరం ప్రైవేటు బ్యాంకు విలీనమైన బ్యాంకు
1969 బ్యాంకు ఆప్ బీహార్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1970 లాహోర్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1971 ఈస్ట్రన్ బ్యాంకు ఛార్టెడ్ బ్యాంకు
1974 కృష్ణారావు బలదేవ్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1976 బెల్గాం బ్యాంకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1985 లక్ష్మీ కమర్షియల్ బ్యాంకు కెనరా బ్యాంకు
1986 మిరాజ్ స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1986 హిందుస్తాన్ కమర్షియల్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు
1990 ట్రేడర్స్ బ్యాంకు బ్యాంకు ఆఫ్ బరోడా
బ్యాంకు ఆఫ్ థారుల్యాండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
బ్యాంకు ఆఫ్ తంజావూరు ఇండియన్ బ్యాంకు
1991 పరూర్ సెంట్రల్ బ్యాంకు బ్యాంకు ఆఫ్ ఇండియా
పూర్వాంచల్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1993 బ్యాంక్ ఆఫ్ కరాడ్ లిమిటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1995 కాశీనాథ్ సేత్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1997 బరిదోబ్ బ్యాంకు లిమిటెడ్ ఒరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్
1999 బరేలి బ్యాంకు లిమిటెడ్ బ్యాంకు ఆఫ్ బరోడా
20వ సెంచరీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంచూరియన్ బ్యాంకు
బ్రిటిష్ బ్యాంకు ఆఫ్ మిడిల్ ఈస్ట్ హెచ్డిబిసి
సిక్కిమ్ బ్యాంకు లిమిటెడ్ యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
టైమ్స్ బ్యాంకు లిమిటెడ్ హెచ్డిబిసి
2002 బెనారస్ స్టేట్ బ్యాంకు లిమిటెడ్ బ్యాంకు ఆఫ్ బరోడా
2003 నేదున్గాడి బ్యాంకు లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు లిమిటెడ్
2004 గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు లిమిటెడ్ ఒరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్
2006 బాంకు ఆఫ్ పంజాబ్ సెంచూరియన్ బ్యాంకు
2006 గణేష్ బ్యాంకు ఆఫ్ కరుందబాద్ ఫెడరల్ బ్యాంకు
2006 యుఎఫ్జె బ్యాంకు లిమిటెడ్ బ్యాంకు ఆఫ్ టోకో మిత్సుబిషి లిమిటెడ్
2007 యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంకు ఐడిబిఐ లిమిటెడ్
2008 లార్డ్ క్రిష్ణ బ్యాంకు సెంచూరియన్ బ్యాంకు ఆఫ్ పంజాబ్
2008 సెంచూరియన్ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి
2020 ఎస్ బ్యాంకు ఎస్బిఐ బెయిల్ అవుట్
కార్పొరేట్ డిఫాల్టర్లు ఏ సంస్థకు ఎంత మాఫీ (రూ. కోట్లలో)
సంస్థ పేరు మాఫీ మొత్తం
గీతాంజలి 5492
ఆర్ఇఐ అగ్రో 4314
విన్సమ్ డైమన్స్ 4076
రోటోమాక్ 2850
కుదోస్ చెమీ 2326
రుచిసోయా 2212
జూమ్ డెవలపర్స్ 2012
ఫరెవ్వర్ ప్రీసియస్ జ్యూవాలరీ 1962
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 1943
డెక్కన్ క్రానికల్స్ 1915
ఎబిజి షిప్‌యార్డ్ 1875
ట్రాన్స్‌ట్రారు 1790
సూర్యా వినాయక్ ఇండిస్టీస్ 1783
ఎస్‌కుమార్ 1581
గిలి ఇండియా 1447
విఎంసి సిస్టమ్ 1331
సిద్ది వినాయక్ లాజిస్టిక్స్ 1318
గుప్తా కోల్ ఇండియా 1235
సూర్యా ఫార్మా 1208
నక్షత్ర బ్రాండ్స్ 1109
ఇండియన్ టెక్నోమాక్ 1091
జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు 1073
హునూంగ్ టార్సు 1039
అండ్ టెక్స్టైల్స్
కెఎస్ ఆయిల్స్ 1026
నకోడా లిమిటెడ్ 1025
కోస్టల్ ప్రాజెక్ట్సు 984
పరేఖ్ అల్యూమినిక్స్ 975
ఫస్ట్ లీజింగ్ సిఓ 929
కాంకాస్ట్ స్టీల్ అండ్ పవర్ 888
స్టెర్లింగ్ ఆయిల్ రిసోర్సెస్ 888
స్టెర్లింగ్ బయోటెక్ 887
యాక్షన్ ఇస్పాత్ అండ్ పవర్ 887
డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 870
సురానా కార్పొరేషన్ 855
ఇందు ప్రాజెక్ట్సు 835
ఎఆర్‌ఎస్‌ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 794
శ్రీ గణేష్ జ్యూవాలరీ 774
ఎలక్ట్రోథరమ్ 768
ఎబిసి కాట్స్పిన్ 766
వరుణ్ ఇండిస్టీ 764
ఎరా ఇన్ఫ్రా 738
ఎస్ఇఎల్ టెక్స్టైల్స్ 718
స్పాన్కో లిమిటెడ్ 705
బిఎస్ లిమిటెడ్ 701
సాయి ఇన్ఫోసిస్టమ్ 683
జే పాలికెమ్ 677
లోహ ఇస్పాత్ 646
జెఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ 630
సెంచరీ కమ్యూనికేషన్ 607
కెమ్రాక్ ఇండిస్టీ అండ్ ఎక్స్పోర్ట్ 605
మొత్తం 50 ఖాతాలు 68,607