Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ఆంక్షలతో అనిశ్చిత్తి
- ఇప్పటికే ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు
- ఆందోళనలో పర్యాటకం, ట్రావెల్ రంగాలు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్ గుబులు పట్టుకుంది. ఇటీవలే రికవరీ పుంజుకుందన్న ప్రభుత్వ వర్గాల ఆశలకు తాజా వైరస్ పరిణామాలు మళ్లీ గండి కొట్టే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ రుణ పుస్తకాల్లో చాలా నెలలుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గరిష్ట వాటాను పొందాయి. కాగా.. గడిచిన అక్టోబర్లో తిరిగి బడా పరిశ్రమల రుణాల జారీలో అధిక వృద్థి నమోదయ్యింది. కరోనా సంక్షోభ కాలంలో చిన్న సంస్థలు, కుటుంబాల రుణ జారీలో ఒత్తిడి నమోదయ్యింది. మరోవైపు పెద్ద సంస్థల రుణాల వృద్థిలో ప్రతికూలత చోటు చేసుకుంది. మళ్లీ ఇదే పరిస్థితులు పునరావృతం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 8.4 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ రికవరీని సూచించింది. తాజా వేరియంట్ కోవిడ్-19 ఒమిక్రాన్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి కొత్త సవాళ్లను విసురుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు తీసుకోబో తున్న ఆంక్షలు పలు రంగాలను మళ్లీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తు న్నాయి. పాక్షిక లాక్డౌన్లు విధించిన వినిమయం భారీగా పడిపోనుం దని భయపడుతున్నాయి. గడిచిన సెప్టెంబర్ వరకు వినియోగ దారులు, వ్యాపార విశ్వాస సూచీలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కరో నాకు ముందు నాటి కంటే అధిక విశ్వాసం నెలకొంది. తాజా వేరి యంట్ ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను తీవ్ర ప్రభావితం చేయనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్ దెబ్బతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు గిలగిల కొట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్, పర్యాటకం, ఆతిథ్య రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ వర్గాలు ఆందోళనకు గురైతున్నాయి.