Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెస్ ఛాంపియన్ సూర్య ప్రకాశ్
న్యూఢిల్లీ : ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నార్త్ ఈస్ట్ మీడియా ఫోరం సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో చెస్ ఛాంపియన్‌గా ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధి కూచిభట్ల సూర్యప్రకాశ్ నిలిచారు. అసోం ట్రిబ్యూన్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కల్యాణ్ బారో, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీలాక్షి భట్టాచార్య దంపతులు కరోనాతో పోరాడి మృతి చెందిన నేపథ్యంలో వారి స్మారకార్థం ఇటీవలి చెస్, క్యారమ్ పోటీలు ఢిల్లీలో నిర్వహించారు. చెస్ ఛాంపియన్‌గా సూర్యప్రకాశ్, రెండో స్థానంలో ద హిందూ స్పోర్ట్స్ ఎడిటర్ రాకేశ్‌రావు, మూడో స్థానంలో ప్రొఫెసర్ వీరేందర్ ఆనంద్, నాలుగో స్థానంలో ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు నిలిచారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోరు చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీతోపాటు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఉమాకాంత్ లఖేడా, సెక్రెటరీ జనరల్ వినరుకుమార్లు పాల్గొన్నారు.