Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ పోలీసులపై ఆనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోయేలా చేయగలరంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అనుచిత వ్యాఖ్యలకు గాను సిద్ధుపై పరువు నష్టం దావా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సుల్తాన్పూర్ లోధిలో జరిగిన ఒక సభలో సిద్ధు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను ప్రశంసిస్తూ.. తమ ఎమ్మెల్యే తన అధికార బలంతో పోలీసుల ప్యాంట్లు తడిచేలా చేయగలరని వ్యాఖ్యానించారు. గత వారం బటాలాలో జరిగిన ఒక సభలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సిద్ధు వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ నేత ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులను అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సిద్ధుని, ఆయన కుటుంబాన్ని రక్షిస్తున్నది పోలీసులు కాదా అని చండీగఢ్ డిఎస్పి దిల్షేర్ సింగ్ చందేల్ ప్రశ్నించారు. ఆయనకు పరువునష్టం నోటీసులు పంపించినట్లు తెలిపారు.