Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : పర్యాటకుల నగరమైన యుపిలో శాంతికి విఘాతం కలిగించాలనుకునే కొన్ని శక్తులను ప్రోత్సహించవద్దని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు నేత రాకేష్ టికాయత్ ప్రజలను హెచ్చరించారు. మథురాను ముజఫర్నగర్గా మార్చకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా ప్రార్థనలు చేయాలనుకున్నా, సాధారణ జీవనం సాగించాలనుకున్నా శాంతికి భంగం కలిగించే వారికి ఓట్లు వేయకూడదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీజేపీకి ఓట్లు వేయవద్దంటూ ప్రజలను హెచ్చరించారు. బీజేపీ మాయలో పడవద్దని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, మథుర అల్లకల్లోలంగా మారడంతో పాటు అధికశాతం మంది నిరుద్యోగులుగా మారతారని అన్నారు.