Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్డియో గౌలా (92) కొల్కత్తాలో గురువారం వయోభారంతో మరణించారు. కార్మిక కుటుంబంలో జన్మించిన గౌలా ట్రేడ్ యూనియన్ ఉద్య మంలోకి రాకముందు కొల్కతా ట్రామ్ కంపెనీలో 15 ఏళ్ల వయస్సులోనే పని చేశారు. ఆ సమయంలోనే ట్రామ్ కంపెనీలోనూ, ఇతర ప్రజారవాణా సంస్థల్లో సమస్యలపై పోరాటం చేశారు. 1970లో సీఐటీయూ వ్యవస్థాపక ఎఐడబ్ల్యూసి సభ్యులుగా ఎన్నికయ్యారు. సీఐటీయూ జాతీయ స్థాయిలోనూ, పశ్చిమ బెంగాల్ స్థాయిలోనూ వివిధ బాధ్యతలు నిర్వహించారు.