Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఈఎఫ్ఐ
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు విద్యుత్ ఉద్యోగుల భారత సమాఖ్య (ఈఈఎఫ్ఐ) మద్దతు తెలిపింది. ఈ సమ్మెను విజయవంతం చేయాలని తన అన్ని విభాగాలకు, విద్యుత్ రంగంలోని అందరు ఉద్యోగులు, ఇంజనీర్లకు ఈఈఎఫ్ఐ పిలుపునిచ్చింది. దేశంలో అన్ని వర్గాల ప్రజల జీవనం, జీవనోపాధికి సంబంధించిన 12 డిమాండ్ పాయింట్ల చార్టర్ అమలు కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఇండిపెండెంట్ ఫెడరేషన్ ఫిబ్రవరి 23-24 తేదీలలో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాప్ 26లో భారత ప్రభుత్వ దక్కోణం, దేశంలో విద్యుత్, పర్యావరణ రంగంలో కార్మికవర్గ ఉద్యమ పరిస్థితిని సమీక్షించేందుకు ఇఇఎఫ్ఐ వర్కింగ్ కమిటీ డిసెంబర్ 28న వర్చువల్గా సమావేశమైంది. దేశభక్తి పేరుతో జాతీయ వనరులు, జాతీయ ఆస్తులను విక్రయించడమే మోడీ ప్రభుత్వ విధానమని సమావేశం విమర్శించింది. విద్యుత్తు (సవరణ) బిల్లు 2021తో విద్యుత్ రంగ ప్రయివేటీకరణకు తలుపులు బార్లా తెరిచిందని ఆరోపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు గ్రామీణ పేద ప్రజల విద్యుత్తు హక్కులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని సమావేశం ఆరోపింది. అయితే ఎస్కెం బ్యానర్ కింద రైతుల ఉద్యమానికి, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హర్యానా, ఒడిశా, అసోం, చంఢగీడ్లో విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల ఐక్య, సాహసోపేత పోరాటానికి ఈఈఎఫ్ఐ శుభాకాంక్షలు తెలిపింది.