Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో యూపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు, అమిత్ షా, పార్టీలోని ఇతర ముఖ్య నేతలంతా యూపీలోనే తిష్ట వేశారు. తాజాగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. యూపీలో డబుల్ స్పీడ్ అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలని మోడీ కోరారు. కొత్త సంవత్సం కొత్త జోష్‌తో పని చేస్తున్నామని తెలిపారు.