Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలను సవరించింది. గతంలో పది రోజుల పాటు స్వీయ నిర్భంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు లేదా స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే ఏడు రోజుల పాటు హౌం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. అలాగే, ఎప్పుడూ కూడా మూడు లేయర్ల మాస్క్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఎనిమిది గంటలకు ఓసారి మాస్క్‌ను మార్చుకోవాలని కోరింది. 72 గంటల తర్వాత మాస్క్‌ను ముక్కలుగా కత్తిరించాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లాల్సి వస్తే ఎన్-95 మాస్క్‌ను ఉపయోగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, కరోనా సోకిన రోగులు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలనీ, ఎక్కువగా ద్రవ పదార్ధాలను సేవించాలని సూచించింది.