Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో లోకల్ ట్రైన్లలో తిరగాలంటే.. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న సర్టిఫికేట్ ఉండాల్సిందే. జనవరి 10 నుండి 31 వరకు ఈ సర్టిఫికేట్ ఉంటేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని దక్షిణ రైల్వే శనివారం ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికేట్ లేని ప్యాసెంజర్లకు టికెట్ అమ్మరని పేర్కొంది. ఈ నిబంధన సీజనల్ టికెట్ కొనుగోలు దారులకు కూడా వర్తిస్తుంది, ఎటువంటి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.