Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో మృతి..
న్యూఢిల్లీ: కథక్ నృత్యంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిర్జూ మహారాజ్ ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. వచ్చే నెలలో బిర్జూ మహారాజ్ 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. 1983లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. దీనితో పాటు, అతను సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ కూడా అందుకున్నారూ. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు కూడా బిర్జు మహారాజ్‌కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.లెజెండరీ కథక్ డ్యాన్సర్ బిర్జూ మహారాజ్ మృతిపై ఆయన మనవరాలు రాగిణి మహారాజ్ గత నెల రోజులుగా చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. అంతాక్షరి ఆడుతుండగా ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆస్పత్రికి తరలించినా కాపాడలేకపోయామని తెలిపారు.