Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 తేదీన నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగాల్సి వుంది. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. అలాగే ఇదే అంశంపై ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని ఈసీకి లేఖ రాశారు. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అధిక శాతం మంది ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకు యూపీలోని వారణాసి సందర్శనకు వెళతారనీ.. దీంతో ఎక్కువ శాతం మంది పోలింగ్‌లో పాల్గొనలేకపోవచ్చని అన్నారు. రాష్ట్ర జనాభాలో 32శాతం మంది ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నందున పోలింగ్‌ను కనీసం ఆరురోజులకు వాయిదా వేయాల్సిందిగా ఆ లేఖలో చరణ్‌జీత్ చన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.