Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం సహా 13 ప్రతిపక్ష పార్టీల డిమాండ్
భువనేశ్వర్ : ఒడిషాలోని ధింకియా, పరిసర గ్రామ ప్రజలపై పోలీసుల అణిచివేతను తక్షణమే ఆపాలని సిపిఎంతో 13 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. జిందాల్ స్టీల్ ప్లాంట్ కోసం బలవంతంగా భూ సేకరణను ఆపాలని విజ్ఞప్తి చేశాయి. అక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై క్రూరంగా అణిచివేతకు పాల్పడుతున్న పోలీసు బలగాను తక్షణమే అక్కడనుంచి తొలగించాలని పేర్కొన్నాయి. ఈ నెల 14న గ్రామస్తులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.