Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
విజయవాడ : విజయవాడలో దారుణం జరిగింది. కామాంధుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భవానీపురం కుమ్మరిపాలెంలో చోటుచేసుకుంది. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు వినోద్జైన్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుమ్మరిపాలెంసెంటర్ లోటస్ అపార్ట్మెంట్లో జి.25 ప్లాటులో కూర్మాపు గంగాధరకుమార్, అనురాధ నివసిస్తున్నారు. వీరికి కుమార్తె దీక్షిత్ గౌరి, కుమారుడు నందశ్రీ విఘ్నేష్ ఉన్నారు. దీక్షిత్ గౌరి (13) బెంజిసర్కిల్ వద్ద గల ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి ఉపాధ్యాయురాలిగా, తండ్రి ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్లో డిఇగా పనిచేస్తున్నారు. ఈ అపార్టుమెంట్లోనే జి.43 ప్లాటులో టీడీపీ నేత వినోద్జైన్ కుటుంబం నివసిస్తోంది. లిప్టులో, మెట్లపై వెళ్లే సమయంలో అసభ్యకరంగా మాట్లాడుతూ శరీరాన్ని తాకుతూ బాలికను రెండు నెలలుగా జైన్ ఇబ్బంది పెడుతున్నాడు. మనస్తాపం చెందిన బాలిక ఎవరితోనూ చెప్పుకోలేక సూసైడ్ నోట్ రాసి ఆపార్టుమెంటు పైనుంచి శనివారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు వినోద్జైన్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.