Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ కోసం ఉవ్వెత్తున నినాదాలు
- చలో విజయవాడ సూపర్ సక్సెస్ ొ ఇక సమ్మే... పోరాటకమిటీ ప్రకటన
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమ సముద్రం ఉప్పొంగింది. న్యాయమైన పీఆర్సీ కోసం ఉవ్వెత్తున నినదించారు. ఒక్కరిని కూడా రానిచ్చేది లేదంటూ ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులు గల్లంతయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు! విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఐదు, ఆరు కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా.. ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, బీసెంట్ రోడ్డు ఇలా ... విజయవాడలోని వీధులన్నీ నిరసనకు కేంద్ర స్థానమైన ఆ రోడ్డువైపునకే దారి తీశాయి. చీమలదండులా ఒక్కసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. ఎర్రజెండాలు చేతపట్టి పరుగు పరుగునా అడ్డంకులను అధిగమించారు. పోలీసు నిఘా కళ్లను ఏమార్చడానికి రైతులుగా, కూలివాళ్లుగా, బిచ్చగాళ్లలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మారారు. కొందరు పెళ్లి బందాల అవతారమెత్తారు. బుధవారం నుండే రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా, అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా విజయవాడ వీధుల్లో కదం తొక్కారు. పీఆర్సీ కోసం ఉదయం 9 గంటల వరకు ఎన్జీఓ హౌమ్ వద్ద పోలీసులు తప్ప ఎవ్వరు కనపించలేదు. 9 గంటల ప్రాంతంలో ఉద్యోగ సంఘాల నేతలతో పాటు, ఎంఎల్‌సి లక్షణరావు అక్కడకు చేరుకున్నారు. అప్పటిదాకా సాధారణ ప్రజల్లా అక్కడ తచ్చాడుతున్న అనేక మంది అక్కడ గుమికూడారు. క్షణాల వ్యవధిలోనే వీరి సంఖ్య భారీగా పెరిగింది. పీడీఎఫ్ ప్లోర్ లీడర్ విటపు బాలసుబ్రమణ్యం వారితో కలిసి నడిచారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి మీసాల రాజేశ్వరి వంతెనమీదుగా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరింది. అంత నిర్బంధాన్ని అమలు చేసినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా అనూహ్యమైన రీతిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి భారీ ప్రదర్శన నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం నివ్వెరపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభు త్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డితో సమావేశమైనారు. చలో జరిగిన తీరుపై ఆరా తీశారు. మరోవైపు పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపో వడంతో ఆటోపైనే సభను నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిం చాలని, లేనిపక్షంలో రేపటి నుంచి సహాయ నిరాకరణ చేపడతామని, ఆరవ తేది అర్ధరాత్రి నుండి సమ్మెను ప్రారంభిస్తామని పోరాట కమిటీ ప్రకటించింది.